कलम संगिनी

कलम संगिनी

నేటి లోకం

నేటి లోకం

17 Views
0 Likes 0 Comments
0 Saves
1 Shares
నేటి లోకం
నేటి లోకం... నేటి లోకం... ఇది నేటి లోకం విలువలు వదిలిన... వింత లోకం! కలుషితమైన బంధాలు - న్యాయం లేని రుజువులు జ్ఞానం లేని చదువులు - డబ్బుతో కొలిచే ప్రేమలు ఎటు పోతోంది ఈ సమాజం... ఎటు సాగుతోంది ఈ పయనం? ||నేటి లోకం|| ​ అవకాశం కోసం బ్రతికే... నకిలీ స్నేహాలు అవసరానికే కలిసే... అతుకుల బంధాలు పైపై మెరుగుల... కృత్రిమ నవ్వులు విలువ లేని మాటలు... విషం చిమ్మే కోరలు నమ్మకమే లేని చోట... బ్రతుకు భారమైపోె! ||నేటి లోకం|| ​ అంధకారంలో నడిపే... ప్రభుత్వాలు నీతిని మరిచిన... నేటి వార్తలు గమ్యం తెలియక సాగే... పరుగు పందెాలు అంతరించిపోతున్న... మంచి ఆచారాలు మానవత్వం మరుగైపోయే... మమకారమే కరువైపోయే! ||నేటి లోకం|| పుణ్యం పాపం తేడా... తెలియని రోజులు మనస్సాక్షిని చంపేసిన... మాయదారి పోకడలు కన్నీరు తుడిచే... చేతులు కరువాయె సాయం చేసే... గుండెలు బరువాయె రాతి బొమ్మలై పోయారు... మనుషులందరూ సహనం నశించి పోయింది... స్వార్థం పెరిగింది! ||నేటి లోకం|| ​ ప్రకృతిని పాడుచేసి... ప్రగతి అని సంబరం గాలిని విషం చేసి... ఊపిరికే గండం రేపటి తరానికి... ఏమిస్తాం కానుక? ఆస్తి పాస్తులా? లేక... అంతులేని వేదన? మేల్కో ఓ మనిషి... మార్చుకో నీ దిశ లేకుంటే మిగలదు... చరిత్రలో నీ ఆనవాళ్లు! ||నేటి లోకం|| రచన: డా.గుండాల విజయ కుమార్

Comments (0)

Click to view
Footer