నేటి లోకం...
నేటి లోకం... ఇది నేటి లోకం
విలువలు వదిలిన... వింత లోకం!
కలుషితమైన బంధాలు - న్యాయం లేని రుజువులు
జ్ఞానం లేని చదువులు - డబ్బుతో కొలిచే ప్రేమలు
ఎటు పోతోంది ఈ సమాజం... ఎటు సాగుతోంది ఈ పయనం? ||నేటి లోకం||
అవకాశం కోసం బ్రతికే... నకిలీ స్నేహాలు
అవసరానికే కలిసే... అతుకుల బంధాలు
పైపై మెరుగుల... కృత్రిమ నవ్వులు
విలువ లేని మాటలు... విషం చిమ్మే కోరలు
నమ్మకమే లేని చోట... బ్రతుకు భారమైపోె! ||నేటి లోకం||
అంధకారంలో నడిపే... ప్రభుత్వాలు
నీతిని మరిచిన... నేటి వార్తలు
గమ్యం తెలియక సాగే... పరుగు పందెాలు
అంతరించిపోతున్న... మంచి ఆచారాలు
మానవత్వం మరుగైపోయే... మమకారమే కరువైపోయే! ||నేటి లోకం||
పుణ్యం పాపం తేడా... తెలియని రోజులు
మనస్సాక్షిని చంపేసిన... మాయదారి పోకడలు
కన్నీరు తుడిచే... చేతులు కరువాయె
సాయం చేసే... గుండెలు బరువాయె
రాతి బొమ్మలై పోయారు... మనుషులందరూ
సహనం నశించి పోయింది... స్వార్థం పెరిగింది! ||నేటి లోకం||
ప్రకృతిని పాడుచేసి... ప్రగతి అని సంబరం
గాలిని విషం చేసి... ఊపిరికే గండం
రేపటి తరానికి... ఏమిస్తాం కానుక?
ఆస్తి పాస్తులా? లేక... అంతులేని వేదన?
మేల్కో ఓ మనిషి... మార్చుకో నీ దిశ
లేకుంటే మిగలదు... చరిత్రలో నీ ఆనవాళ్లు! ||నేటి లోకం||
రచన: డా.గుండాల విజయ కుమార్
నేటి లోకం
నేటి లోకం
Please log in to post a comment.
No comments yet
Be the first to share your thoughts about this post!